రేర్ ఫీట్ సాధించిన మహారాజా

ఈ ఇయర్ జూన్ లో పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజైన సినిమా మహారాజా. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమాగా తెరకెక్కిన మహారాజాకు కొంతమేర పబ్లిసిటీ వచ్చింది. కానీ సేతుపతి సోలో హీరోగా గత కొన్నేళ్లలో చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడకపోవడంతో మహారాజా కూడా ఆ లిస్ట్ లోకే వెళ్తుందనుకున్నారు.
కానీ ఈ సినిమాను డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ రూపొందించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా హీరోగా సేతుపతి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా మారింది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి లాభాలొచ్చాయి. ఇదిలా ఉంటే కొన్ని వారాల కిందటే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ లో కూడా మహారాజాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇండియా మొత్తమ్మీద ఏ ఇయర్ నెట్‌ఫ్లిక్స్ లో మోస్ట వ్యూడ్ సినిమాగా మహారాజా నిలిచింది. లాపటా లేడీస్, క్రూ లాంటి బాలీవుడ్ హిట్ సినిమాలు సాధించిన వ్యూస్ ను కూడా మహారాజా దాటేసింది. నార్మల్ గా నెట్‌ఫ్లిక్స్ లో ఇండియా వరకు ఎప్పుడూ బాలీవుడ్ సినిమాలే టాప్ లో ఉంటాయి. ఇప్పుడు ఆ ఫీట్ ను మహారాజా అధిగమించింది. అన్ని భాషల వాళ్లూ మహారాజాను చూడటం వల్లే వ్యూస్ పరంగా ఈ సినిమా టాప్ లో నిలిచింది. మరి ఈ ఇయర్ వేరే ఏ సినిమా అయినా దీన్ని అధిగమిస్తుందేమో చూడాలి.