తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.