Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » The suspect movie trailer launch

The Suspect: ఘనంగా “ది సస్పెక్ట్” మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్

  • Published By: techteam
  • March 12, 2025 / 09:20 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
The Suspect Movie Trailer Launch

రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ది సస్పెక్ట్ (The Suspect). ఈ చిత్రాన్ని టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు రాధాకృష్ణ (Radha Krishna) రూపొందించారు. ది సస్పెక్ట్ సినిమా ఈ నెల 21న ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

Telugu Times Custom Ads

ప్రొడ్యూసర్ పద్మినీ నాగులపల్లి మాట్లాడుతూ – ది సస్పెక్ట్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ఆర్టిస్టులు అందరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ది సస్పెక్ట్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.

దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – ది సస్పెక్ట్ మూవీ ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్ కిరణ్ గారు నాకు ఎప్పటినుంచో స్నేహితులు. ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే కాదు మంచి క్యారెక్టర్ లో నటించారు. పెద్ద సినిమాలు జీరో కలెక్షన్స్ చేసినవి ఉన్నాయి. చిన్న చిత్రాలు అద్భుతంగా ఆదరణ పొందినవీ ఉన్నాయి. ది సస్పెక్ట్ సినిమా చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించాలి. ఈ సినిమా విజయం సాధిస్తే రాధాకృష్ణ లాంటి దర్శకులకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇలాంటి సినిమాలకు మంచి లాభాలు రావాలి. మీరంతా ది సస్పెక్ట్ చిత్రానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత కిరణ్ కుమార్ మాట్లాడుతూ – సినిమా రంగంలోకి రావాలనేది నా కల. ది సస్పెక్ట్ సినిమాతో ఆ కల నెరవేరింది. నా స్నేహితుడు వీఎన్ ఆదిత్య మా మూవీ ఈవెంట్ కు రావడం ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. రాధాకృష్ణ చేసిన ఒక షార్ట్ ఫిలిం చూసి నచ్చి ఈ సినిమాకు దర్శకత్వం చేయమని అడిగాను. రాధాకృష్ణే ఈ సినిమాకు అన్నీ తానై రూపొందించాడు. యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని ఈ చిత్రంలో ఒక రోల్ చేశాను. ఈ మూవీలో అంతా కొత్తవాళ్లే అయితే వాళ్లకు నటనలో స్టేజీ ఎక్సిపీరియన్స్ ఉంది. వాళ్లంతా బాగా నటించారు. ది సస్పెక్ట్ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాఅన్నారు.

నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ – ది సస్పెక్ట్ సినిమాలో సాంగ్ లాంఛ్ నా చేతుల మీదుగా చేయడం సంతోషంగా ఉంది. మూవీ ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు వీఎన్ ఆదిత్య గారు ఈ సినిమాలో పాట రాయడం విశేషం. ఈ సినిమా కిరణ్ గారికి మంచి పేరు డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.

డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ – ఈ రోజు మా సస్పెక్ట్ సినిమా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా చేసేందుకు పడే కష్టం చిన్న చిత్రానికైనా పెద్ద చిత్రానికైనా ఒక్కటే. మేము ఈ సినిమాను అందరికీ నచ్చేలా మంచి సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా రూపొందించాం. ఒక అమ్మాయి హత్యకు కారకులైన వారిని పట్టుకునే క్రమంలో సాగే చిత్రమిది. కొత్త ఆర్టిస్టులైనా ఎంతో అనుభవం ఉన్న వారిలా బాగా పర్ ఫార్మ్ చేశారు. ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కిరణ్ గారికి థ్యాంక్స్. మా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న ఆదినారాయణ గారికి థ్యాంక్స్. ఈ నెల 21న థియేటర్స్ లోకి వస్తున్న ది సస్పెక్ట్ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఈ చిత్రం ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా మార్చి 21న రిలీజ్ కాబోతుంది.

 

 

Tags
  • Director V.N. Aditya
  • roopa
  • Rushi Kiran
  • swetha
  • The Suspect

Related News

  • Sudugali Sudheer Hilesso Movie Pooja Ceremony

    Hilesso: సుధీర్ ఆనంద్ “హైలెస్సో” గ్రాండ్‌గా లాంచ్- ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టిన వివి వినాయక్

  • Sashivadane Trailer Release

    Sashivadane Trailer: ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్

  • Special Movie On Kattappa

    Kattappa: క‌ట్ట‌ప్ప‌పై ఓ స్పెష‌ల్ మూవీ?

  • Simbhu In Davara2 Movie

    Devara2: దేవ‌ర‌2లో కోలీవుడ్ న‌టుడు?

  • Rishab Shetty About Jai Hanuman

    Rishab Shetty: అందుకే జై హ‌నుమాన్ ఒప్పుకున్నా

  • Tollywood Hero In Animal2 Movie

    Animal2: బాలీవుడ్ సూప‌ర్ హిట్ సీక్వెల్ లో టాలీవుడ్ న‌టుడు?

Latest News
  • Bathukamma: ఘనంగా బతుకమ్మ వేడుకలు.. రెండు గిన్నిస్‌ రికార్డులు కైవసం
  • Visakhapatnam: విశాఖ భాగస్వామ్య సదస్సుకు రండి
  • Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కి బెయిల్‌
  • AP Bhavan: ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ కుమార్‌ బాధ్యతల స్వీకరణ
  • MYTA: మలేషియాలో ఘనంగా మైటా బతుకమ్మ సంబరాలు
  • Nobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?
  • POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
  • NJ: న్యూజెర్సిలో వికసిత భారత్‌ రన్‌ విజయవంతం..
  • White House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్‌ వీడియో వైరల్‌
  • Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer