Sree Leela: చీరకట్టులో మెరిసిపోతున్న లీలమ్మ

పెళ్లి సందD(Pelli sandaD) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల(Sree Leela) ఆ సినిమాతో మంచి గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత శ్రీలీలకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా శ్రీలీల ఓ వెలుగు వెలుగుతుంది. అయితే లీల ఎంత బిజీగా ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజా శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌లో చీర కట్టు ఫోటోలను షేర్ చేసింది. చీర కట్టులో ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ తో ఆ చీరకే అందం తెచ్చింది శ్రీలీల. చీర కట్టు, దానికి తగ్గట్లుగా సింపుల్ హెయిర్ స్టైల్, అంతకంటే సింపుల్ జ్యువెలరీ తో శ్రీలీల మరింత అందంగా కనిపిస్తోంది. శ్రీలీల షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.