Samantha: మానసిక ప్రశాంతతపై సమంత ఇన్‌స్టా పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత(samantha) గత కొన్నాళ్లుగా వివిధ విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. అయితే సమంత తన లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రమ్ స్టోరీలో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో సమంత ఇతరుల మాటల్ని పట్టించుకోవద్దని చెప్పింది.
లైఫ్ లో ఏదైనా జరగనీ అన్నట్టు ఉంటే ప్రశాంతత రాదని, ఆ ప్రశాంతత కోసం ఎప్పుడూ నిరంతర సాధన అవసరమనీ, ప్రశాంతతను ఎంజాయ్ చేయాలి తప్పించి, దాంతో పోరాడకూడదని, జరిగే దాన్ని జరగనివ్వాలి తప్పించి దేన్నీ ఆపకూడదని సమంత రాసుకొచ్చింది. నేనిది చేయాల్సింది అనుకునే బదులు నేను తప్పకుండా చేయాల్సిందే అనేలా మైండ్ ను మార్చుకోవాలని సమంత సూచించింది.
మనం పెట్టుకునే లిమిట్స్ అన్నీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ లో భాగమేనని, నిశ్చలంగా ఉన్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుందని, మీ శక్తిని తీసుకునే అర్హత ఎవరికీ లేదని, మన గౌరవంకు ప్రెజెర్ ఎప్పుడూ అడ్డుకట్టు కాకూడదని సమంత తన స్టోరీలో పోస్ట్ చేసింది. సమంత ఉన్నట్టుండి మానసిక ప్రశాంతత గురించి ఎందుకు పోస్ట్ చేసిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/3659603625625268258?igsh=YzMxdTF3eTl5eWEw