Regina Cassandra: బ్లాక్ గౌన్ లో డిఫరెంట్ గా కనిపిస్తోన్న రెజీనా
టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రెజీనా కసాండ్రా(Regina Cassandra) తన అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఒకప్పుడు టైర్2 హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రెజీనా ఇప్పుడు తమిళ, హిందీ సినిమాలకు పరిమితమైంది. అయితే తెలుగులో సినిమాలు చేయకపోయినా రెజీనా ఇన్స్టా ద్వారా తన ఫాలోవర్లకు టచ్ లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు రెగ్యులర్ గా అప్డేట్స్ ను ఇచ్చే రెజీనా తాజాగా బ్లాక్ కలర్ మినీ గౌన్ ధరించి చాలా డిఫరెంట్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎక్కువగా మేకప్ లేకుండా, సింపుల్ గ్రే షేడ్ మేకోవర్, డీసెంట్ హెయిర్ స్టైల్ తో రెజీనా ఈ ఫోటోలో చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.







