Peddi: పెద్ది ఫస్ట్ సింగిల్ అందుకే లేట్

గేమ్ ఛేంజర్(game changer) తో భారీ ఫ్లాపును మూట గట్టుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) ప్రస్తుతం బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో పెద్ది(peddi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తుండగా, పెద్ది మూవీకి రెహమాన్ సంగీతం మేజర్ హైలైట్ కానుందని మేకర్స్ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, త్వరలోనే పెద్ది ఫస్ట్ సింగిల్(peddi first single) ను రిలీజ్ చేయనున్నామని మొన్నా మధ్య మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఆ ఫస్ట్ సింగిల్ దసరా సందర్భంగా వస్తుందని అంతా అనుకున్నారు.
కానీ దసరాకు పెద్ది నుంచి ఎలాంటి సాంగ్ రిలీజవలేదు. అయితే పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎందుకు ఆలస్యమవుతుందో ఓ అప్డేట్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం పెద్ది ఫస్ట్ సింగిల్ రెడీగా ఉన్నప్పటికీ, ఆ సాంగ్ ను షూటింగ్ చేశాక లిరికల్ వీడియోలో కొన్ని విజువల్స్ ను యాడ్ చేసి వాటితో పాటూ రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఫస్ట్ సింగిల్ ను డిలే చేస్తున్నారని తెలుస్తోంది. ఫస్ట్ సింగిల్ గా రానున్న లవ్ సాంగ్ ను రెహమాన్ చాలా ఫ్రెష్ గా కంపోజ్ చేశారని అంటున్నారు. కాగా పెద్ది మూవీ వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.