Naveen Chandra: సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లా నవీన్ చంద్ర స్పీడు

అందాల రాక్షసి(andala rakshasi) సినిమాతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న నవీన్ చంద్ర(naveen chandra) ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ తన కెరీర్ కు అవేమీ పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టు గా మారి సినిమాలు చేశాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర హీరోగా చేసిన సినిమాల్లో హిట్లు చాలా తక్కువ.
అందుకే కేవలం స్టార్ కాంబినేషన్ కోసం అరవింద సమేత(aravinda sametha), వీర సింహారెడ్డి(Veera simhareddy), గేమ్ ఛేంజర్(game changer) లాంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. నవీన్ చంద్ర హీరోగా కాకుండా ఇతర హీరోలు నటిస్తున్న సినిమాల్లో విలన్ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తుండటం చూసి ఇక అతనికి హీరోగా ఛాన్సులు రావనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా నవీన్ చంద్ర కెరీర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లా దూసుకెళ్తుంది.
నవీన్ చంద్ర నుంచి రెండు నెలల్లో ఏకంగా మూడు సినిమాలు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నవీన్ చంద్ర సినిమాలకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ప్రొడ్యూసర్లు అతనితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. నవీన్ కూడా తన దగ్గరకి వచ్చిన కథల్లో మంచి వాటిని ఎంచుకుని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. గత నెలలో వారం గ్యాప్ లోనే నవీన్ నటించిన బ్లైండ్ స్పాట్(blind spot), లెవెన్(eleven) సినిమాలు రిలీజ్ కాగా వాటిలో లెవెన్ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ రన్ తర్వాత ఈ రెండు సినిమాలూ ఒకేరోజు ఓటీటీలోకి రాగా, ఆడియన్స్ ఆ సినిమాలను చూసే లోపు ఇప్పుడు నవీన్ నుంచి షో టైమ్(show time) అనే సినిమా జులై 4న రిలీజ్ కానుంది. పలు సినిమాలతో బిజీగా ఉన్న నవీన్ ఇకపై ప్రాధాన్యం లేని సపోర్టింగ్ రోల్స్ వస్తే చేయనని తేల్చి చెప్తున్నాడు.