Nagarjuna: రష్మిక నేషనల్ క్రష్ కాదు, నాగ్ క్రష్

కుబేర(kubera) విజయోత్సవ వేడుకలో భాగంగా నాగార్జున(nagarjuna) రష్మిక(rashmika)ను పొగడ్తలతో ఆకాశానికెత్తేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సూపర్ హిట్ దిశగా వెళ్తోంది. కుబేర సినిమా హిట్ అవడానికి కారణం శేఖర్ కమ్ముల(sekhar kammula)నే అని చెప్పిన నాగార్జున, తనకు దీపక్ లాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ సినిమాలో దేవా క్యారెక్టర్ లో ధనుష్(dhanush) తప్ప ఎవరూ చేయలేరని, ధనుష్ యాక్టింగ్ గురించి చెప్పడానికి తన దగ్గర మాటలు కూడా లేవని చెప్పిన నాగ్, రష్మికను తెగ ప్రశంసించాడు. సమీరా(sameera) లాంటి క్యారెక్టర్ ను రష్మిక చేయగలడం విశేషమని, రష్మికను చూస్తుంటే తనకు క్షణ క్షణం(kshana kshanam) సినిమాలోని అతిలోక సుందరి శ్రీదేవి(sridevi) గుర్తుకువస్తుందని చెప్పాడు.
కుబేర సినిమాలో చాలా ఫ్రేముల్లో రష్మిక తన కంటికి శ్రీదేవిలానే అనిపించిందని, అసలు రష్మికకు నేషనల్ క్రష్ అనే పేరు ఎప్పట్నుంచి వచ్చిందని అడగ్గా అక్కడే ఉన్న దేవీ శ్రీ ప్రసాద్(devi sri prasad) పుష్ప(pushpa) నుంచి అనగా, అయినా రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు, నాగ్ క్రష్ కూడా అని చెప్పడంతో అదే ప్రాంగణంలో ఉన్న రష్మిక తెగ సిగ్గు పడింది. అదే ఈవెంట్ లో చిరంజీవి(chiranjeevi) రష్మిక గురించి మాట్లాడుతూ రష్మిక క్రమంగా నేషనల్ క్రష్ నుంచి ఇంటర్నేషనల్ క్రష్ గా మారిపోయిందని చెప్పాడు.