Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ) ను అగ్ర కథానాయకుడు నాగార్జున (Nagarjuna ) కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్ (Akhil) వివాహ వేడుకకు ఆహ్వానించారు. అనంతరం ఆయనతో కాసేపు మాట్లాడారు. గతేడాది నవంబర్‌లో అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీ (Zainab Rawji) తో జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అధికారికంగా వివాహ తేదీ వెల్లడిరచనప్పటికీ జూన్ 6న వీరి పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.