Mana Shankaraavaraprasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’ వినాయక చవితి స్పెషల్ ట్రెడిషనల్ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవెయిటింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankaraavaraprasad Garu). హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ ఆధ్వర్యంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అర్చన సగర్వంగా సమర్పిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పండగకి వస్తున్నారు అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం వస్తుంది.
ఈ రోజు, వినాయక చవితి శుభ సందర్భంగా, మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి ఒక గొప్ప సాంప్రదాయ అవతార్ లో పట్టు చొక్కా, పట్టు పంచె, కండువా ధరించి, స్టైలిష్ షేడ్స్ తో ఓ షిప్ డెక్క్ మీద గ్రాండ్ ట్రెడిషనల్ లుక్‌లో అలరించారు. కల్చరల్ టచ్, మెగాస్టార్ స్టైల్ రెండూ మిక్స్ అయి పోస్టర్ ఫ్యాన్స్‌కు ఫెస్టివ్ ట్రీట్ అందించింది.
మెగాస్టార్‌కి డైహార్డ్ ఫ్యాన్ అయిన అనిల్ రావిపూడి, ఫ్యాన్స్ ఎలాగైతే చిరంజీవిని చూడాలనుకుంటారో అలాంటి అద్భుతైన క్యారెక్టర్లో చూపిస్తున్నారు. హీరోయిన్గా నయనతార నటిస్తోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఎడిటింగ్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్ ఏఎస్ ప్రకాష్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలుగా, ఎస్. కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
మన శంకరవరప్రసాద్ గారు 2026 సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.







