Yogi Adityanath :సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మంచు విష్ణు భేటీ

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తో నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu), ఆయన తనయుడు నటుడు విష్ణు (Vishnu) భేటీ అయ్యారు. లఖ్‌నవూ చేరుకున్న వారిద్దరూ సీఎంను కలిసి కన్నప్ప (Kannappa) సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ (Release date poster ) ను యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విష్ణు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధ్యాంక్యూ చెప్పారు. నేను ఎంతగానో అభిమానించే వ్యక్తుల్లో ఒకరైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశాను. కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ఆయన చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా అనిపించింది. రమేశ్ గొరిజాల గీసిన అద్భుతమైన కళాఖండాన్ని ఆయనకు కానుకగా అందించాం. జూన్ 27న కన్నప్ప విడుదల కానుంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మోహన్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. మీ ఆతిథ్యానికి, ఆప్యాయతకు ధన్యవాదాలు అని అన్నారు. ఈ భేటీలో ప్రభుదేవా సైతం పాల్గొన్నారు.