Lavanya Tripathi: పాక్ కు సపోర్ట్ చేస్తున్న మహిళపై మెగాకోడలు ఫైర్
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్(pahalgam) లో జరిగిన ఉగ్రదాడి అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ దాడిలో అమాయకులైన టూరిస్టులు ప్రాణాలు కోల్పోవడంతో అందరూ చాలా కోపంగా ఉన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఈ విషయంలో ఒకతాటిపై నిలబడి ఉగ్రదాడికి కారణమైన వారిని తీవ్రంగా శిక్షించాలని నిరసన తెలుపుతున్నారు.
నిరసనలో భాగంగా పాకిస్తాన్ జెండాను రోడ్లపై అంటించి కాళ్లతో తొక్కుతూ నిరసన తెలుపుతున్నారు. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని ఓ యువతి రోడ్డుపై అంటించిన పాకిస్తాన్ జెండాలను తీసి, వాటిని తొక్కనీయకుండా అడ్డుకుంది. దీంతో అక్కడి స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత గొడవ పడినప్పటికీ ఆమె ఆ జెండాను తిరిగి రోడ్డుపై అంటించడానికి నిరాకరించింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దానిపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) రెస్పాండ్ అయింది. మన సైనికులు వారి ప్రాణాలకు తెగించి దేశాన్ని సేవ్ చేస్తుంటే, దేశానికి హాని కలిగించే వారికి కొందరు సపోర్ట్ చేయడం ఎంతో బాధగా ఉందని, దేశం లోపలి నుంచే శుద్ధి జరగాలని లావణ్య త్రిపాఠి పోస్ట్ చేసింది.






