మరో రెండు రోజుల్లో… ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘వకీల్ సాబ్’ మూవీ
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా ఓటీటీ వేదికపై ప్రసారం కాబోతోంది. ఈ మేరకు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ నెల తిరక్కుండానే డిజిటల్ మాద్యమాల్లోకి ఎంటర్ అవుతోంది. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో చాలా రోజుల తర్వాత థియేటర్స్‌లో సందడి వాతావరణం కనిపించింది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. కానీ ఆ సంబరం ఎక్కువకాలం నిలవలేదు. థియేటర్ ఫుల్స్ అవుతున్న తరుణం లో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పెరగడంతో మళ్ళీ థియేటర్ల గేట్లకు తాళాలు పడ్డాయి. దీంతో నేరుగా ‘వకీల్ సాబ్’ని ఇంట్లోకే తీసుకొచ్చే ప్లాన్ చేశారు మేకర్స్. ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో వకీల్ సాబ్ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఈ వేదికపై వకీల్ సాబ్ స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ విషయమై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నా చిత్రయూనిట్ మాత్రం వాటిని ఖండించింది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఊహించని విధంగా పెరగడంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు మేకర్స్. బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ సినిమా ‘పింక్’ రీమేక్‌గా ‘వకీల్‌సాబ్’ రూపొందించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా సమర్పించారు. చిత్రంలో లాయర్లుగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ పోటాపోటీ నటన తెలుగు ప్రేక్షకుల మెప్పు, విమర్శకుల తో మంచి రేటింగ్ సాధించుకుంది. హీరోయిన్లుగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగేళ్ల, శృతి హాసన్ వారి వారి పాత్రలకు న్యాయం చేస్తూ చిత్ర విజయంలో పాలుపంచుకున్నారు.







