Family Man Season3: త్వరలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్3

మన దేశంలో ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లు అందులో ఫ్యామిలీ మ్యాన్(family man) కూడా ఒకటి. ప్రైమ్ వీడియోలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సిరీస్‌ల్లో ఒకటిగా నిలిచిన ఫ్యామిలీ మ్యాన్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్ కోసం రెడీ అవుతుంది. మనోజ్ బాజ్ పాయ్(manoj bajpayee) లీడ్ రోల్ లో వస్తోన్న ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కు సంబంధించి ప్రైమ్ వీడియో(Prime Video) సరికొత్త పోస్టర్ ను తమ సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
దీనికి ది ఫ్యామిలీ మ్యాన్ రిటర్న్స్ అనే టైటిల్ ను లాక్ చేయడం విశేషం. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ ప్రైమ్ వీడియో అందరి కళ్లు మా ఫ్యామిలీ మ్యాన్ పైనే. కొత్త సీజన్ త్వరలో అని వెల్లడించగా, ఈ పోస్టర్ లో మనోజ్ బాజ్ పాయ్ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. రాజ్ అండ్ డీకే(Raj & DK) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ కు సంబంధించిన సీజన్3 నవంబర్ లో రిలీజయ్యే అవకాశాలున్నట్టు మనోజ్ బాజ్‌పాయ్ గతంలో వెల్లడించారు.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్3(Family man season3) షూటింగ్ గత సంవత్సరం మే నెలలో మొదలుపెట్టగా, ఇటీవలే దానికి సంబంధించిన షూటింగ్ పూర్తైంది. ఈ సీజన్3 షూటింగ్ తమ కెరీర్లోనే ఎంతో కష్టమైన షూటింగ్ గా రాజ్ అండ్ డీకే తెలిపారు. రెండో సీజన్ లో నటించిన ప్రియమణి(priyamani), షరీబ్ హష్మీ(Sharib Hashmi), వేదాంత్(Vedanth) లాంటి నటీనటులతో పాటూ ఈ సీజన్ లో జైదీప్ అహ్లావత్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
https://x.com/PrimeVideoIN/status/1937428060409598074