Balakrishna: ఫ్యాన్స్ ఈ అవార్డు ఎప్పుడో రావాల్సింది అన్నారు
అఖండ(Akhanda), వీర సింహారెడ్డి(Veera Simha reddy), భగవంత్ కేసరి(Bhagavanth Kesari), డాకు మహారాజ్(daku Maharaj) సినిమాలతో వరుస హిట్లు అందుకున్న బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadhi Murmu) చేతుల మీదుగా ఆ అవార్డును బాలయ్య అందుకున్నారు.
పద్మ పురస్కారం అందుకోవడానికి తెలుగు సాంప్రదాయ దుస్తులైన పంచెకట్టులో వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలయ్య, ఆ అవార్డు అందుకున్న తర్వాత తన సంతోషాన్ని వెల్లడించారు. పద్మ పురస్కారం రావడంపై తానెంతో సంతోషంగా ఉన్నానని ఈ అవార్డు రావడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని ఆయన అన్నారు.
తన ఫ్యాన్స్ మాత్రం ఈ అవార్డు ముందే రావాల్సింది అంటుంటారని కానీ దానికి తాను ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్తానని, ఎందుకంటే తాను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడంతో పాటూ, వరుసగా నాలుగు సినిమాలు హిట్ అవడం, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, తాను చైర్మన్ గా బాధ్యతలు వహిస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దేశంలోనే మంచి హాస్పిటల్స్ లో ఒకటిగా నిలిచాయని, అందుకే తాను పద్మ పురస్కారానికి ఈ టైమే కరెక్ట్ అని చెప్తుంటానని బాలయ్య(Balayya) తెలిపారు. బాలయ్య పద్మ పురస్కారం అందుకుంటున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






