Aashika Ranganath: చీరకట్టులో పండగ కళతో మెరిసిపోతున్న ఆషికా

సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఎక్కువగా తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితికి ప్రజలే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. పండుగకు మరింత సాంప్రదాయంగా, అందంగా రెడీ అయ్యి ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి తాజాగా ప్రముఖ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్(Aashika Ranganath) కూడా వచ్చి చేరింది. వినాయక చవితి సందర్భంగా చాలా అందంగా రెడీ అయ్యి.. ఆ ఫోటోలను ఇన్ స్టా ద్వారా షేర్ చేసి.. ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది. యాష్ కలర్ ప్లెయిన్ సారీ కట్టుకున్న ఆషికా దానికి కాంబినేషన్ గా స్లీవ్ లెస్ ఎల్లో కలర్ బ్లౌజ్ ధరించి, కొద్దిగా జుట్టును ముడి పెట్టి మిగతా జుట్టును లీవ్ చేసిన ఆషికా రంగనాథ్.. ఆ ముడికి చాలా చక్కగా పూలు పెట్టి మరింత సాంప్రదాయంగా కనిపించగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.