Trump Mobile: ట్రంప్ మొబైల్ ఫోన్లు రాబోతున్నాయ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యక్తిగత లాభాల కోసం ప్రభుత్వ విధానాలను వినియోగించుకుంటున్నారనే విమర్శ ఇప్పటికే అమెరికాలో ఉంది. అయినా కూడా డొనాల్డ్ ట్రంప్ కుటుంబం మరో కంపెనీ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. మొబైల్ ఫోన్ కంపెనీ ని ప్రారంభించనున్నట్లు ట్రంప్ కుటుంబం తెలిపింది. ట్రంప్ మొబైల్ (Trump Mobile) పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ అమెరికా లో తయారయ్యే ఫోన్లను విక్రయిస్తుందని డొనాల్డ్ ట్రంప్ కుమారుల్లో ఒకరైన ఎరిక్ ట్రంప్ (Eric Trump ) నకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ (Trump Organization) తెలిపింది. ఫోన్ సర్వీస్ కోసం ఒక కాల్ సెంటర్‌ను కూడా అమెరికాలోనే ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.