SBI : ఎస్‌బీఐ గుడ్‌న్యూస్ .. హోమ్‌లోన్‌లపై

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణ గ్రహీతలకు గుడ్‌న్యూస్ (Good news) చెప్పింది. ఆర్‌బీఐ (RBI) రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో హోమ్‌లోన్ (Home Loan)లపై వడ్డీని తగ్గించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండిరగ్ రేట్ రేటులో 50 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టింది. సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్‌బీఐ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించాయి. రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి దిగొచ్చింది. ఈ నేపథ్యంలో రుణ రేట్లను ఎస్‌బీఐ (SBI) సవరించింది.