Google: గూగుల్‌లో మళ్లీ లేఆఫ్‌లు!

వ్యయ నియంత్రణ చర్యలను కొనసాగిస్తున్న అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ (Google) తాజాగా వివిధ విభాగాల్లోని కొంతమంది సిబ్బందిని తొలగించాలని భావిస్తోంది. ఎన్ని ఉద్యోగాలపై కోత విధిస్తారో స్పష్టత లేకపోయినా గూగుల్ సెర్చ్, ప్రకటనలు (Advertising), రీసెర్చ్ (Research), ఇంజినీరింగ్ (, Engineering) యూనిట్లలో కొంత మంది ఉద్యోగులను తొలగించే ( లేఆఫ్ ప్రకటించే) అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో మా బృందాల్లో అమెరికా గూగ్లర్ల కోసం స్వచ్ఛంద నిష్రమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మరింత మందికి లేఆఫ్‌ల (Layoffs)కు కంపెనీ సిద్దమైందని గూగుల్ అధికార ప్రతినిధి కొర్టెనే మెన్సిని వెల్లడిరచారు. 2023 నుంచి గూగుల్ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడిరది. అప్పట్లో 12,000 మందిని తొలగించిన సంగతి విదితమే.