GST : కేంద్రం మరో గుడ్‌న్యూస్

ఆదాయపు పన్న పరిమితిని రూ.12 లక్షలకు అమాంతం పెంచి మధ్యతరగతికి ఊరట కల్పించిన కేంద్రం మరో గుడ్‌న్యూస్ (Good news) చెప్పేందుకు సిద్ధమవుతోంది. మధ్య తరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జీఎస్టీ (GST) తగ్గించాలని చూస్తోంది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా 12 శాతంలో ఉన్న చాలావరకు వస్తువులను 5 శాతం ట్యాక్స్ శ్లాబ్ పరిధిలోకి తీసుకురావడమో చేయాలని కేంద్రం చూస్తోంది. తద్వారా వారిపై భారం తగ్గించాలని భావిస్తోంది. పేద, మధ్యతరగతి ఎక్కువగా వినియోగించే టూత్‌పేస్టు, టూత్ పౌడర్, గొడుగులు (Umbrellas), కుట్టుమిషన్లు, ఫ్రైజర్ కుక్కర్లు, వంటగదిలో వినియోగించే పాత్రలు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెసిన్లు (Washing machines), సైకిళ్లు (Bicycles) రూ.1000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, ఫుట్‌వేర్, స్టేషనరీ వస్తువుతు, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు వంటివి జీఎస్టీ తగ్గించాలని భావిస్తున్న వస్తువుల జాబితాలో ఉన్నాయి. ప్రతిపాదిత వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తే అవి తక్కువ ధరకే పేద, మధ్యతరగతి వర్గాలకు లభిస్తాయి.