Warren Buffett: వారెన్ బఫెట్ మరోసారి భారీ విరాళం

అమెరికా కుబేరుడు, స్టాక్ మార్కె ట్ (Stock market) ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. తాజాగా ఆయన మరోసారి భూరి విరాళం అందించారు.అమెరికా (America) కేంద్రంగా పనిచేసే ఐదు స్వచ్ఛంద సేవా సంస్థ (Charity organization)లకు తన నిర్వహణలోని బెర్క్ షైర్ హాత్‌వే (Berkshire Hathaway )కు చెందిన 600 కోట్ల డాలర్ల (సుమారు రూ.51,300 కోట్లు) విలువైన 1.24 కోట్ల షేర్లను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 2006 నుంచి ఈ ఐదు సంస్థలకు బఫెట్ విరాళంగా ఇచ్చిన షేర్ల విలువ 6,000 కోట్ల డాలర్లకు (సుమా రు రూ.5.13 లక్షల కోట్లు) చేరింది. సోమవారం ఈ షేర్లను ఆయా స్వచ్ఛంద సేవా సంస్థల పేరు మీద బదిలీ చేయనున్నట్టు బఫెట్ తెలిపారు.