Air India:ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఢిల్లీ – వాషింగ్టన్ విమాన సర్వీసులు నిలిపివేత

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ – వాషింగ్టన్ డీసీ (Delhi – Washington DC) మధ్య నాన్ సాప్ట్ విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిలిపివేత నిర్ణయం సెప్టెంబర్ (September ) 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. ఆపరేషన్ సంబంధిత పరిమితుల దృష్ట్యా ఈ రూట్‌లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దాదాపు 26 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు రెట్రోఫిటింగ్ చేపడుతున్నందున విమానాల కొరత ఉంటుందని, అలాగే, పాకిస్థాన్ (Pakistan) గగనతలం మూసివేత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.విమానాల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.