Meta : మెటా కీలక ప్రకటన.. వాట్సాప్‌లో త్వరలో!

భారతీయులు పెద్ద సంఖ్యలో వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) వినియోగంపై మెటా (Meta) కీలక ప్రకటన చేసింది. మరికొద్ది నెలల్లో వాట్సాప్‌లో ప్రకటనలు (యాడ్స్), సబ్‌స్క్రిప్షన్ ప్రవేశ పెడుతున్నామని వాట్సాప్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది. ఇకపై యాప్‌లోని అప్‌డేట్స్ ట్యాబ్‌లో అడ్వైజ్టెజ్‌మెంట్‌కు సంబంధించిన ఫీచర్లు తీసుకురానున్నట్టు తన బ్లాగ్‌పోస్టులో వాట్సాప్ వెల్లడిరచింది. అప్‌డేట్స్ ట్యాబ్ (Tab)లో చానళ్లు, స్టేటస్ విభాగాల్లో ఇవి కనిపించనున్నాయి. యాప్ వాడేవారిలో 150 కోట్ల మంది రోజూ ఈ అప్‌డేట్స్ ట్యాబ్ చూస్తుంటారని అంచనా. ఈ నేపథ్యంలో అడ్మిన్లకు, అర్గనైజర్ల (Organizers)కు, వ్యాపారులకు యాప్ ద్వారా ఎదిగేందుకు అవకాశం కల్పించేలా ప్రకటనలు తీసుకొస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. ఛానల్ సబ్‌స్క్రిప్షన్: నెలవారీ ఫీజు చెల్లించి మీకు ఇష్టమైన ఛానల్‌కు సపోర్ట్ చేయొచ్చు. ప్రమోటెడ్ ఛానల్ : ప్రస్తుతం ఛానల్స్‌ను ఎక్స్‌ప్లోర్స్ చేస్తే ట్రెండిరగ్‌లో ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. ఇకపై అడ్మిన్లు కొంత మొత్తం చెల్లించి తమ ఛానల్‌ను ప్రమోట్ చేసుకోవచ్చు.