Gautam Adani : అదానీకి అమెరికా కోర్టు సమన్లు అందించే యత్నం!

గతేడాది నమోదైన సివిల్ సెక్యూరిటీస్ కేసుకు సంబంధించిన కోర్టు పత్రాలను భారత కుబేరుడు గౌతమ్ అదానీ (Gautam Adani), ఆయన బంధువు సాగర్ (Sagar)కు అందించే యత్నాల్లో ఉన్నట్లు న్యూయార్క్ (New York)లోని ఫెడరల్ కోర్టుకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (సెక్) తెలిపింది. ఈ కేసులో నేరారోపణకు గురయిన అదానీకి సమన్లను హేగ్ సర్వీస్ కన్వెన్షన్ కింద అందించే ప్రక్రియలో ఉన్నట్లు వివరించింది. భారతదేశం (India)లో ఉన్న వారికి అధికారికంగా సమన్లను అధికారికంగా అందించలేదని స్పష్టం చేసింది. పునరుత్పాదక విత్యుత్తు సరఫరా కాంట్రాక్టు పొందేందుకు భారత్‌లోని కొందరికి 265 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.2,300 కోట్ల ) లంచాన్ని ఇచ్చేందుకు, అదానీ గ్రూప్ (Adani Group) అమెరికాలో నిధులు సమీకరించిందన్నది ఆరోపణ. విదేశీయులకు నేరుగా సమన్లు అందించేందుకు యూఎస్ సెక్‌కు అధికారం లేదు.