ASBL NSL Infratech

వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. వారి లిస్ట్ ఒకేచోట!

వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. వారి లిస్ట్ ఒకేచోట!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమైంది. పిన్‌ చాట్‌, ఏఐ ఫీచర్లను తీసుకొచ్చిన యాప్‌, ఇప్పుడు చాట్‌ లిస్ట్‌లో ప్రత్యేక ఆప్షన్‌ తీసుకురానుంది. ఆన్‌లైన్‌లో ఉండేవారి లిస్ట్‌ ఒకేచోట దర్శనమివ్వనుంది. దీంతో కమ్యూనికేషన్‌ అనుభవం మరింత మెరుగుకానుందని వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకుంది. సాధారణంగా వాట్సప్‌ కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఓపెన్‌ చేయగానే చాట్‌ లిస్ట్‌ దర్శనమిస్తుంది. అందులో ఎవరు ఆన్‌లైన్‌ ఉన్నారు? ఆఫ్‌లైన్‌లో ఎవరు ఉన్నారు? అనే వివరాలు తెలియాలంటే చాట్‌ లిస్ట్‌ ఓపెన్‌ చేయాల్సిందే. అలాకాకుండా కాసేపటి వరకు ఆన్‌లైన్‌లో ఉన్న వారి జాబితాను చూపిస్తే బాగుంటుంది కదా. అదే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు వాట్సప్‌ సన్నద్ధమవుతోంది. వాట్సప్‌ ఓపెన్‌ చేయగానే యాక్టివ్‌ చాట్‌ లిస్ట్‌ కనిపించేలా కొత్త ఆప్షన్‌ను త్వరలోనే వాట్సాప్‌ తీసుకురానున్నట్లు తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :