వాషింగ్టన్ తెలుగు సమితి (వాట్స్)
రెండు దశాబ్దాలుగా వాట్స్ సంఘం అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న తెలుగు వారికి సాంస్కృతిక, సాహిత్య, విద్యా, సామాజిక, కార్యక్రమాలను అందిస్తూ మన తెలుగు దన్నాన్ని భావితరాలకు పరిచయం చేస్తూ ఉంది. అమెరికా లోని ఉత్తమ తెలుగు సంఘాలలో ఒకటిగా విరాజి ల్లుతుంది. సంక్రాంతి, ఉగాది, దీపావళి వంటి పెద్ద పండుగల సమయాల్లో నిర్వహించే కార్యక్రమాలతో పాటు, కమ్యూనిటీకి అవసరమైన కార్యక్రమాలను వాట్స్ నిర్వహిస్తోంది. సమ్మర్ క్యాంప్, మెడిటేషన్, ఆటల పోటీలు, బతుకమ్మ, దసరా వేడుకలు మ్యూజికల్ కన్సర్ట్ వంటివి వాట్స్ కార్యక్రమాల్లో చోటు చేసుకున్నాయి.
ప్రస్తుతం వాట్స్కు అధ్యక్షురాలిగా సునీత కొత్తపల్లి వ్యవహరిస్తున్నారు. తెలుగు బడి ఉపాధ్యాయినిగా, సాంస్కృతిక కార్యకర్తగా, స్వయం సేవికగా పదిహేను సంవత్సరాలుగా వాషింగ్టన్ తెలుగు సమితి అందరికి సేవలు అందించారు. 2024 సమితి అధ్యక్షురాలిగా వాషింగ్టన్ తెలుగు ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం మరెన్నో వినూత్నమైన అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తమ టీమ్ కృషి చేస్తుందని ఆమె తెలిపారు. యునైటెడ్ స్టేట్స్లో పుట్టి, ఇక్కడ పెరిగిన యువతను వాట్స్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించేలా ఆమె కృషి చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు మన సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిచయం చేసి అందులో విలువను తెలియ చెప్పుట సంస్థ లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు తనవంతుగా కృషి చేస్తానని అంటూ వాట్స్ నిర్వహించే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని ఆమె కోరారు.
భవిష్యత్ తరాలకు మన సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిచయం చేయడంతోపాటు వారిని కూడా వాట్స్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా, నేటితరం ఇష్టపడేలా మా కార్యక్రమాలు, సేవలు కనిపిస్తాయి. తెలుగు కమ్యూనిటితోపాటు ఇండియన్ కమ్యూనిటీ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములవడం, జాతీయ తెలుగు సంఘాలతో కలిసి పనిచేయడం ద్వారా వాట్స్ సేవలను విస్తరింపజేస్తున్నాము.
తెలుగు కమ్యూనిటికీ పోర్టల్, పత్రిక, యూట్యూబ్ ద్వారా మీడియా సేవలు అందిస్తున్న తెలుగు టైమ్స్‌కు 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.