అనిరుధ్‌ను మిస్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్
అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అనిరుధ్ ఇతర భాషల డైరెక్టర్లకు అంత ఈజీగా దొరకడం లేదు. కానీ కొంత మంది మాత్రం ఎంత లేటైనా పర్లేదు తమ సినిమాకు అనిరుధే కావాలని పట్టుబట్టి మరీ తనతో కలిసి పనిచేయాలనుకుంటున్నారు. రూ.10 కోట్లు పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకాడటం లేదంటే అనిరుధ్ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం అనిరుధ్ చేతిలో టాలీవుడ్ నుంచి దేవర, గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్ సినిమాలున్నాయి. ఈ సినిమాల ఆల్బమ్స్ గురించి ఆయా చిత్ర యూనిట్స్ చెప్తున్న మాటలు వింటుంటే ఎప్పుడెప్పుడు అవి బయటకు వస్తాయా అని ఎదురుచూడటం ఖాయం. ఇక అసలు విషయానికొస్తే రీసెంట్ గా విజయ్ నటిస్తున్న గోట్ సినిమా ఫస్ట్ లిరికల్ రిలీజ్ అయింది.
యువన్ శంకర్ రాజా స్వరాలందించిన ఆ పాటను స్వయంగా హీరోనే పాడాడు. లిరిక్స్ హుషారుగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ను ఆ సాంగ్ అంతగా శాటిస్ఫై చేయలేకపోయింది. ఇదే పాటలకు అనిరుధ్ సంగీతం ఇచ్చి ఉంటే అవి నెక్ట్స్ లెవెల్ లో ఉండేవని ఫ్యాన్స్ అభిప్రాయపడుఉన్నారు. దానికి రీజన్ లేకపోలేదు. విక్రమ్, మాస్టర్, జైలర్ లాంటి సినిమాలకు అనిరుధ్ వర్క్ అందరికీ తెలుసు. ఆ సినిమాలకు అనిరుధ్ తన బీజీఎంతో ప్రాణం పోశాడు. ఒకప్పుడు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చిన యువన్, ఇప్పుడు ఆ స్థాయిలో ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నాడనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.