ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాలీవుడ్ హీరో కోసం క్యూ కడుతున్న హాలీవుడ్ డైరెక్టర్స్...

బాలీవుడ్ హీరో కోసం క్యూ కడుతున్న హాలీవుడ్ డైరెక్టర్స్...

పాన్ ఇండియా మూవీస్ ఇప్పుడు ఒక ట్రెండ్ అయ్యింది. పాన్ ఇండియా వండర్స్ తో ఇండియన్ సినిమా కీర్తి నలుదిశలా పాకుతోంది. హాలీవుడ్ సైతం మన సినిమాపై, మన స్టార్స్ పై, మనం చేస్తున్న కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తూ, ఆరా తీస్తోందంటే ఇండియన్ సినిమా ఏ స్థాయిలో వైరల్ అవుతోందో అర్థం చేసుకోడవచ్చు. రీసెంట్ గా రాజమౌళి తెరకెక్కించిన 'RRR' ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా , అందులోనూ తెలుగు సినిమా పవర్ ఏంటో చూపించింది. 

దీంతో హాలీవుడ్ టెక్నీషియన్ ఆర్టిస్ట్ లు, నిర్మాతల కన్ను ఇండియన్ సినిమాపై పడింది. ఈ తరుణంలో ఇప్పడు బాలీవుడ్ హీరోకు గోల్డెన్ ఆఫర్ వరించింది. అసలు ఆ బాలీవుడ్ హీరో ఎవరు? అతడికి వచ్చిన ఆ లక్కీ ఛాన్స్  ఏంటని తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఓ వెబ్ సిరీస్ ని తెరపైకి తీసుకురాబోతున్నారు.

కెప్టెన్ అమెరికా సిరీస్, అవెంజర్స్ సిరీస్ లతో పాటు రీసెంట్ గా ధనుష్ తో 'ది గ్రే మ్యాన్' మూవీని రూపొందించిన హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్స్ రుస్సో బ్రదర్స్ , ఎజిబో ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న స్పై థ్రిల్లర్ సిరీస్ 'సీటాడెల్'. దీనికి ఇండియన్ వెర్షన్ ని 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సంచలనం సృష్టించిన రాజ్ అండ్ డీకె డైరెక్ట్ చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ స్టూడియోస్ కోసం అత్యంత భారీ స్థాయిలో రూపొందించబోతున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు.

ఈ ఇండియన్ వెర్షన్ కు హాలీవుడ్ డైరెక్టర్స్ రుస్సో బ్రదర్స్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించబోతున్నారు. ఇందులో క్రేజీ హీరోయిన్ సమంత కూడా నటించనుంది. అయితే ప్రస్తుతం తను మయోసైటీస్ తో బాధపడుతున్న నేపథ్యంలో సామ్ ఇందులో నటిస్తుందా? లేదా అనేది తెలియాల్సి వుంది.

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటనని బుధవారం అమెజాన్ ప్రైమ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. వరుణ్ ధావన్ మోషన్ పోస్టర్ ని షేర్ చేసింది అమెజాన్ ప్రైమ్. అంతే కాకుండా ఈ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ ని జనవరి నుంచి ప్రారంభిస్తున్నట్టుగా కూడా ప్రకటించడం విశేషం. ఇక అమెజాన్ రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ లో వరుణ్ తన న్యూ లుక్ తో అదరకొడ్తున్నాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :