ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హక్కుల ఉల్లంఘనలపై భారత్ దృష్టి సారించాలి : అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు మెక్‌గవర్న్‌

హక్కుల ఉల్లంఘనలపై భారత్ దృష్టి సారించాలి : అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు మెక్‌గవర్న్‌

మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై దృష్టి సారించకపోతే, భారతదేశ ఉజ్వల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశముందని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు, టామ్‌ లాంటోస్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ కో చైర్‌ జేమ్స్‌ మెక్‌గవర్న్‌ పేర్కొన్నారు. భారత్‌లో మానవ హక్కులపై విచారణ సందర్భంగా మెక్‌గవర్న్‌ మాట్లాడుతూ మణిపూర్‌లో రెండు జాతుల మధ్య చెలరేగిన హింస ఒక ఉదాహరణ మాత్రమేనని ఆయన తెలిపారు. అమెరికాకు భారత్‌ మంచి మిత్రుడని, ఆ దేశ అభివృద్ధి మాకు ఎంతో ముఖ్యమైన విషయమన్నారు. హక్కుల ఉల్లంఘన పరిష్కారానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ఆ దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ విషయంలో భారత్‌కు తన వంతుగా అమెరికా కాంగ్రెస్‌ సహకారం అందించాలని సూచించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :