ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హైదరాబాద్ లో మోడ్‌మెడ్‌ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్ లో మోడ్‌మెడ్‌ కేంద్రం ప్రారంభం

వైద్య రంగానికి క్లౌడ్‌ టెక్నాలజీ సేవలు అందించే అమెరికా సంస్థ మోడ్‌మెడ్‌, హైదరాబాద్‌లో తన మొదటి గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ (జీసీసీ)ను ప్రారంభించింది. మాదాపూర్‌లో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 మంది ఉద్యోగులతో దీన్ని నెలకొల్పారు. ఈ సంవత్సరాంతానికి ఉద్యోగుల సంఖ్య 200కు పెరుగుతుందని, దీనికి తగ్గట్లుగా ఇంజినీరింగ్‌, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌, సపోర్ట్‌ విభాగాల్లో కొత్త నియామకాలు చేపడుతున్నట్లు మోడ్‌మెడ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డేనియల్‌ కేన్‌ తెలిపారు. తమ కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌ కేంద్రం ఎంతో దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు వివరించారు. అలెర్జీ, చర్మ వ్యాధులు, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆప్తమాలజీ, ఆర్థో పెడిక్స్‌, నొప్పి నివారణ, ఫ్లాస్టిక్‌ సర్జరీ, యూరాలజీ తదితర విభాగాలకు అనువైన క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌ను మోడ్‌మెడ్‌ ఆవిష్కరించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :