ASBL NSL Infratech

జూన్ 18 నుంచి అమెరికాలో శ్రీవారి కల్యాణోత్సవాలు

జూన్ 18 నుంచి అమెరికాలో శ్రీవారి కల్యాణోత్సవాలు

లోక కల్యాణం కోసం ఉద్భవించిన వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని ఖండాంతరాలు దాటి నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికను సిద్ధం చేసింది. కొవిడ్‌కు ముందు పలు దేశాల్లో స్వామివారి ఉత్సవాలను నిర్వహించిన టీటీడీ తాజాగా ఈసారి అమెరికాలో నిర్వహించేందుకు సిద్ధమైంది. అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో జూన్‌ 18 నుంచి జులై 3వ తేదీ దాకా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడిరచారు. దీంట్లో భాగంగా జూన్‌ 18న శాన్‌ ఫ్రాన్సిస్కో, 19న సియోటెల్‌, 25న డల్లాస్‌, 26న సేయింట్‌ లూయిస్‌, జులై 3న వాషింగ్టన్‌ డీసీ, జులై 5న న్యూ ఒరియన్స్‌లో కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీకి చెందిన బోర్డు సభ్యులు, అర్చకులు, వేద పండితులు కల్యాణోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఎపిఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :