ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కెరీర్ స్టార్టింగ్ లో నేను మోసపోయాను..! హీరో నిఖిల్

కెరీర్ స్టార్టింగ్ లో నేను మోసపోయాను..! హీరో నిఖిల్

సినిమా రంగం అంటేనే ఒక మాయా ప్రపంచం. వెండితెరపైన వెలగాలని ఉవ్విళ్లూరే కుర్రకారుని ఈ మాయా ప్రపంచంలో మోసం చేసేవాళ్ళు కోకొల్లలు. అమాయకులని బురిడీ కొట్టించి జేబులు నింపుకొనే మాయగాళ్లకు ఇండస్ట్రీలో కొదవేం లేదు. చిన్న హీరోల దగర్నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఎదో ఒక కథ ఉంటూనే ఉంటుంది. ఈ సినిమా మాయగాళ్ళ భారిన పడ్డ వారిలో రీసెంట్ గా ఇప్పుడు యువ స్టార్ నటుడు నిఖిల్  సిధార్థ కూడా చేరారు. 

నటుడవ్వడానికి , సినిమాల్లోకి రావడానికి ఆయన ఓ సినిమాయ గాడికి 5 లక్షల రూపాయలు సమర్పించుకుని మోసపోయారట. మొత్తం కోటి రూపాయలు తెస్తే హీరో చేస్తామంటూ ఆయనకు ఆశ కూడా చూపించారట. తానెలా మోసపోయింది స్వయంగా ఆయనే చెప్పారు. నిఖిల్ ఇండస్ట్రీ పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకుని దూసుకెళుతున్నారు అన్న విషయం  తెలిసిందే. వైవిధ్యభరితమైన కథల సినిమాలను ఎంచుకుని హిట్లు కొడుతూ, సక్సెస్ ఫుల్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి నిఖిల్ కెరీర్ లో  బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఆయన "18 పేజెస్" సినిమాతో  ఈ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి కెరీర్ స్టార్టింగ్ లో ఆయన ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కొంతమంది ఆడిషన్స్ పేరిట మోసాలు చేసేవారట. కోటి రూపాయలు తెస్తే హీరో చేస్తామని చెప్పేవారట. ఇక ఒక మాయగాడైతే ఆడిషన్స్ చేసి నటుడిగా ఎంపిక చేశామని చెప్పి నిఖిల్ నుండి రూ.5లక్షలు తీసుకున్నారట. ఆఖరికి ఆ సినిమా చిత్రీకరణకు కేవలం లక్ష ఖర్చు పెట్టేసి జంప్ అయ్యాడట. లాస్ట్ కి నా ప్రయత్నం ఫలించి, శేఖర్ కమ్ముల గారు చాలా జెన్యూన్ గా నా యాక్టింగ్ నచ్చి నాకు అవకాశమిచ్చారు. అది నా కెరీర్ ని మలుపుతిప్పింది అని నిఖిల్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :