ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కాజ‌ల్ త‌న కొడుక్కి చూపించే మొద‌టి సినిమా అదేన‌ట‌!

కాజ‌ల్ త‌న కొడుక్కి చూపించే మొద‌టి సినిమా అదేన‌ట‌!

ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన కాజ‌ల్ అగ‌ర్వాల్, త‌ర్వాత టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌క్కువ రోజుల్లోనే చాలా పెద్ద రేంజ్‌కు వెళ్లింది. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్ బాబు, జూ.ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్‌లోని టాప్ హీరోలంద‌రితో సినిమాలు చేసింది. టాలీవుడ్ లోనే కాదు.. త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ పెద్ద హీరోల‌తో సినిమాలు చేసింది కాజ‌ల్.

దాదాపు ప‌దిహేన‌ళ్లు తిరుగులేని ప్ర‌యాణం సాగించిన కాజ‌ల్, మరిన్ని అవ‌కాశాలు అందుకుంటున్న టైమ్‌లో త‌న ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. కాజ‌ల్ పెళ్లిని ఫ్యాన్స్ కు పెద్ద షాక్. అలాంటిది వెంట‌నే కాజ‌ల్ ప్రెగ్నెంట్ అయి, బిడ్డ‌ను కూడా క‌నింది. గ‌తేడాది కాజ‌ల్ కు నీల్ అనే బాబు పుట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నీల్‌తో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్న కాజ‌ల్, రానున్న కాలంలో త‌న కొడుకు విషయంలో ఎలా కేర్ తీసుకోబోతుందో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నీల్‌కు 8ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు సినిమాల‌కు దూరంగా ఉంచ‌నున్న‌ట్లు కాజ‌ల్ తెలిపింది. ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవీ త‌న‌కు అందుబాటులో ఉంచ‌కుండా దూరంగా పెడుతున్న‌ట్లు కాజ‌ల్ చెప్పింది. అంతే కాకుండా నీల్ కు కాస్త ఊహ వ‌చ్చాక త‌న సినిమాలన్నీ చూపిస్తాన‌ని, అప్పుడు కూడా ముందుగా తుపాకీ సినిమాను చూపిస్తాన‌ని కాజ‌ల్ వెల్ల‌డించింది. 

విజ‌య్ స‌ర‌స‌న కాజ‌ల్ హీరోగా న‌టించిన తుపాకి సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా కంటే కాజ‌ల్ పెర్ఫామెన్స్ ఇంకా బాగున్న సినిమాలు చాలానే ఉన్న‌ప్ప‌టికీ, కాజ‌ల్ మాత్రం తుపాకీ సినిమాను చూపించాల‌నుకోవ‌డం అంద‌రినీ షాక్ కు గురి చేస్తుంది. ఇదిలా ఉంటే కాజ‌ల్ త్వ‌ర‌లోనే బాల‌య్య‌- అనిల్ రావిపూడి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :