ASBL NSL Infratech

ఉద్యోగులకు స్పైస్ జెట్ షాక్!

ఉద్యోగులకు స్పైస్ జెట్ షాక్!

విమానయాన రంగంలోనూ కొలువుల కోత ప్రారంభమైంది. లో బడ్జెట్‌ క్యారియర్‌ స్పైస్‌జెట్‌ 1,000 నుంచి 1,350 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్దమవుతోంది. ఎంతమందిని ఇంటికి పంపించాలనే విషయంపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పైస్‌జెట్‌ అధికార వర్గాలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపించక తప్పదని స్పైస్‌జెట్‌కు చెందిన అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ తీసివేతలతో ఏటా కనీసం రూ.100 కోట్లు ఆదా అవుతాయని కంపెనీ భావిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :