ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టెక్కలి కింగ్ ఎవరు?

టెక్కలి కింగ్ ఎవరు?

రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక స్థానాల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఒకటి. ఎందుకంటే ఈ స్థానంలో ఏపీ టీడీపీ ఛీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు పోటీలో ఉన్నారు. అచ్చెన్నాయుడు.. వైసీపీపై ఒంటికాలితో లేస్తూ, గుక్క తిప్పుకోకుండా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జగన్ పైనే నేరుగా .. అసెంబ్లీ, ఇతర వేదికలపైనా విరుచుకుపడుతున్నారు. అలాంటి అచ్చెన్నను ఈసారి అసెంబ్లీ గేటు తాకనీయకుండా చేయాలని జగన్ పక్కాగా ప్లాన్ చేశారు. అచ్చెన్నాయుడిపై .. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పోటీలో దించారు.

వరుసగా రెండు పర్యాయాలు టెక్కలి నుంచి గెల్చిన అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొట్టాలని కసిగా ఉన్నారు. అచ్చెన్నాయుడు వెలమ సామాజిక వర్గం కాగా.. అతనిపై కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడను బరిలోకి దించడం ద్వారా గట్టి షాకివ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కాళింగ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో .. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే , అచ్చెన్నను ఓడించవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో కింజరాపు కుటుంబానికి మంచి పేరుంది. దీంతోపాటు వారికి భారీగా అనుచరవర్గం కూడా ఉంది. మరోవైపు లోక్ సభ స్థానానికి సైతం కాళింగవర్గానికి చెందిన పేరాడ తిలక్ ను ప్రకటించారు. ఫలితంగా కాళింగ సామాజికవర్గం వైసీపీతో ఉంటుందన్నది వైసీపీ వర్గీయుల భావనగా తెలుస్తోంది.

అయితే ఇక్కడే వైసీపీకి ఇబ్బందికర పరిణామం ఎదురవుతోంది. తనకు వైసీపీలో అవమానం జరిగిందని భావిస్తున్న కేంద్రమాజీమంత్రి కిల్లి కృపారాణి.. కాంగ్రెస్ లో చేరి టెక్కలి నుంచి అసెంబ్లీస్థానానికి బరిలోకి దిగారు. కిల్లి కృపారాణి సైతం.. కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో టెక్కలిలో తమ వర్గం ఓట్లను చీల్చడం ద్వారా.. దువ్వాడ శ్రీనివాస్ ను ఓడించాలన్నది కిల్లి ప్లాన్ గా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో కిల్లి కృపారాణికి కూడ సొంతవర్గముంది.దీంతో వారు.. ఈఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానంలోనూ ఫ్యాన్ ను తిరగనివ్వమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈపరిణామం కాస్త వైసీపీకి ఇబ్బందికరమే అని చెప్పొచ్చు. 2004లో కాంగ్రెస్ పార్టీలో కృపారాణి చేరారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

2009లో రెండోసారి పోటీ చేసి సీనియర్ నాయకుడు ఎర్రం నాయుడు ను ఓడించారు. జైంట్ కిల్లర్ గా నిలిచి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014లో వైసీపీలోకి కాంగ్రెస్ పార్టీ నేతలు చేరినా.. కృపారాణి మాత్రం అదే పార్టీలో కొనసాగారు. కానీ 2019లో సరైన గౌరవం ఇస్తామని చెప్పి ఆమెను వైసీపీలోకి తీసుకెళ్లారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది ఆమెకు. ఆమె కంటే జూనియర్లు అయిన దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ లకు జగన్ టికెట్లు కట్టబెట్టారు. కానీ కృపారాణి విషయానికి వచ్చేసరికి మాత్రం మొండి చేయి చూపారు.. అందుకే ఆమె వైసీపీని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు కిల్లికృపారాణి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :