ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వామ్మో... జూనియర్ ఎన్టీఆర్‌ను బీజేపీ మామూలుగా వాడుకోవట్లేదుగా..?

వామ్మో... జూనియర్ ఎన్టీఆర్‌ను బీజేపీ మామూలుగా వాడుకోవట్లేదుగా..?

జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బీజేపీకి ఆటబొమ్మగా మారారు. ఆయనతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా ఆయన పేరును వాడుసుకుంటోంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ కు మేలు చేస్తుందా.. లేకుంటే బీజేపీకి లబ్ది చేకూరుస్తుందా.. అనేది ఇప్పుడే చెప్పలేం. అసలు బీజేపీ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది.. ఎందుకు ఆయన్ను బీజేపీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది..?

అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలన్నీ ఇంకో స్టెప్ ముందుకెళ్లాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అమిత్ షాను కలిసారు.. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది.. అనేది ఎవ్వరికీ తెలీదు.. ఎందుకంటే ఎవరూ దీనిపై నోరు మెదపరు.. మెదపలేదు. అమిత్ షా మాత్రం RRR సినిమా చూశానని.. అందులో ఎన్టీఆర్ నటన బాగుందని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు. వాళ్లిద్దరి మధ్య నిజంగానే RRR సినిమా గురించి చర్చ జరిగిందా.. లేకుంటే రాజకీయాల పైన కూడా మాట్లాడుకున్నారా.. అనేది తెలీదు. ఈ మీటింగ్ పై ఎన్టీఆర్ ఎక్కడా నోరు మెదపలేదు. సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు.

అయితే అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన మరుసటి రోజు నుంచే బీజేపీ ఈ భేటీని విచ్చలవిడిగా వాడేసుకుంటోంది. బీజేపీ పట్ల జూనియర్ ఎన్టీఆర్ సానుకూలంగా ఉన్నారని.. కచ్చితంగా బీజేపీతో కలిసి నడుస్తారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన ప్రకటన ఇందుకు ప్రధాన ఉదాహరణ. లక్ష్మణ్ ప్రకటన తర్వాత కిషన్ రెడ్డి కూడా జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలు కొత్త కాదని.. తనకన్నీ తెలుసని చెప్పుకొచ్చారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ను తెలంగాణలో ప్రచారం కోసం బీజేపీ వాడుకుంటుందనే ప్రచారం ఊపందుకుంది.

ఇంతలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా మేల్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఎప్పుడు, ఎక్కడ వాడుకోవాలో తమకు బాగా తెలుసన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువని.. కచ్చితంగా ఆయన సేవలను వాడుకుంటామని ఆయన వెల్లడించారు. అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడ ప్రజాదరణ ఎక్కువగా ఉంటే అక్కడ వాడేసుకుంటామన్నారు. ఆ పార్టీకి చెందిన మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి ఏకంగా మోదీ పుట్టిన రోజున జూనియర్ ఎన్టీఆర్ బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించేశారు. పవన్ - జూనియర్ జోడీతో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్టు చెప్పారు. ఇలా అటు తెలంగాణ, ఇటు ఏపీతో సంబంధం లేకుండా బీజేపీ నేతలందరూ జూనియర్ ఎన్టీఆర్ ను విపరీతంగా వాడేసుకుంటున్నారు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకేమీ తెలియనట్లు, తనకేమీ ముట్టనట్లు కామ్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. బీజేపీ నేతల కామెంట్స్ పైన అస్సలు స్పందించట్లేదు. అమిత్ షాతో భేటీ అయినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ పై పలు రకాల కామెంట్స్ చేశారు. కానీ జూనియర్ మాత్రం పట్టించుకోలేదు. మౌనం అర్థాంగీకారం అనుకోవాలా.. లేకుంటే సినిమా వాళ్లలాగా ఇలాంటి కామెంట్స్ కు స్పందించాల్సిన అవసరం లేదనుకుంటున్నారా.. అనేది తెలియట్లేదు. ఏదేమైనా జూనియర్ ని వాడుకోవడంలో మాత్రం బీజేపీ సక్సెస్ అవుతోంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :