ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గుంటూరు కారంకు షాకింగ్ టీఆర్పీ

గుంటూరు కారంకు షాకింగ్ టీఆర్పీ

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గుంటూరు కారం సినిమాకు టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం వ‌ర్క‌వుట్ అయింది. ప్రేక్ష‌కుల అంచ‌నాలను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైన గుంటూరు కారం రీసెంట్ గా బుల్లితెర‌పై మాత్రం అద‌ర‌గొట్టేసింది. ఇటీవ‌లే గుంటూరు కారం బుల్లితెర ప్రీమియ‌ర్స్ ప‌డ‌గా, దానికి ఏకంగా 9.23 టీఆర్పీ సాధించింది.

ఈ టీఆర్పీ చూసి టీవీ వ‌ర్గాలు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. రూరల్,అర్బ‌న్ క‌లిపి 8.31 టీఆర్పీ న‌మోదైంది. గ‌త కొంత కాలంగా టీవీ లో వ‌స్తున్న కొత్త సినిమాల‌కు సైతం పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించడం లేదు. వాల్తేరు వీర‌య్య‌కు 5.14 టీఆర్పీ రాగా ద‌స‌రా, హాయ్ నాన్న సినిమాలు 5 కూడా దాట‌లేక‌పోయాయి. వీట‌న్నింటినీ చూస్తుంటే మ‌హేష్ బుల్లి తెర స్టామినా ఏంటో అర్థ‌మ‌వుతుంది.

ఇప్ప‌టికీ మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా అత్య‌ధికంగా 23.5 టీఆర్పీతో రెండో స్థానంలో ఉండ‌గా, అల వైకుంఠ‌పురంలో సినిమా 29.4 టీఆర్పీల‌తో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంది. యావ‌రేజ్ టాక్ తోనే గుంటూరు కారం ఈ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుందంటే ఒక‌వేళ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్, ఇండస్ట్రీ హిట్ అయితే ఏ రేంజ్ లో టీఆర్పీ న‌మోదు చేసేదో అని ట్రేడ్ పండితులు అనుకుంటున్నారు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :