విశ్వంభర కోసం 17 సెట్స్
భోళా శంకర్ తర్వాత చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియ ఫాంటసీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గానే హై ఓల్టేజ్ ఇంటర్వెల్ సీన్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వెల్ సీన్ మొత్తం సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం.
చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరూ చేస్తున్న మరో క్యారెక్టర్ ను ప్రీ ఇంటర్వెల్ సీన్ లోనే పరిచయం చేయనున్నాడట డైరెక్టర్. భారీ యాక్షన్ సీన్స్ తో ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య ఆ క్యారెక్టర్ ను మేకర్స్ పరిచయం చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విశ్వంభర సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, ఏకంగా 17 డిఫరెంట్ సెట్స్ ను వేయగా, అందులో ఇప్పటికి 9 సెట్స్ లో షూటింగ్ ను పూర్తి చేశారట. మిగిలిన సెట్స్ లో కూడా త్వరలోనే షూటింగ్ జరగబోతుంది. ఈ సెట్స్ అన్నీ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే వేశారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.