ASBL NSL Infratech

బాటా, తానా ఆధ్వర్యంలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

బాటా, తానా ఆధ్వర్యంలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో పాఠశాల 11వ వార్షిక దినోత్సవం (వసంతోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు. 500 మంది అతిథులు (విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు) ఈ వేడుకకు రావడంతో కార్యక్రమం విజయవంతమైంది. 6 గంటలపాటు సాగిన ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాటలు, పద్యాలు, నాటికలు మరియు ప్రసంగాలు వచ్చినవారిని అలరించాయి. వేడుకలు జరిగిన ఆడిటోరియంను రంగుల బ్యానర్లు, పూలు, ఇతర కళలతో అందంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. 

బాటా సలహాదారు విజయ ఆసూరి, వెంకట్‌ కోగంటి (తానా జాయింట్‌ సెక్రటరీ), వెంకట్‌ అడుసుమిల్లి (తానా ఆర్‌ఆర్‌, ఉత్తర కాలిఫోర్నియా), ప్రసాద్‌ మంగిన (సలహాదారు), సుబ్బారావు చెన్నూరి (పాఠశాల వ్యవస్థాపకులు), డాక్టర్‌ రమేష్‌ కొండా, వీరు వుప్పల, డా.గీతా మాధవి తదితరులు ఈ వేడుకలు విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల వార్షిక దినోత్సవానికి హాజరైనందుకు విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు తానా, బాటా టీమ్‌లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయులు మరియు కోఆర్డినేటర్ల ప్రయత్నాలను నాయకులు ప్రశంసించారు మరియు ప్రతి సంవత్సరం పాఠశాలలో చేరేవారి సంఖ్య పెరుగుతోందని మరియు బే ఏరియాలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. సులభంగా తెలుగును నేర్పించే సిలబస్‌తో పాఠశాల చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తోందని వక్తలు పేర్కొన్నారు. సొగసరిఅత్త గడసరికోడలు (స్కిట్‌), ఎందరో మహానుభావులు (నాటిక), ఆంబ పలుకు .. జగదాంబ పలుకు, ‘‘అవధానం’’ (అవధానం), మంత్రి యంపిక, మోహిని భస్మాసుర, శ్లోకాలు/పద్యాలు/గేయాలు కూడా ప్రదర్శించబడ్డాయి. వాటన్నింటికీ మంచి ఆదరణ లభించింది.

వేదిక వద్ద కోఆర్డినేటర్లు పాఠశాలకు సంబంధించిన వివరాలను కాబోయే విద్యార్థులు/తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రిజిస్ట్రేషన్‌ బూత్‌ మరియు ఈ-లెర్నింగ్‌పై ప్రత్యేక డెమో కూడా ఏర్పాటు చేయబడిరది. హాజరైనవారు మరియు వారి పిల్లలు ఉత్సాహంగా  పాఠశాలలో చేరడానికి ఆసక్తిని కనబరిచారు. ఈ వేడుకల్లో చాలా మంది ఎదురుచూస్తున్న క్షణం గ్రాడ్యుయేషన్‌ వాక్‌. ప్రతి కేంద్రం నుండి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తమ సర్టిఫికేట్‌లను స్వీకరించడానికి వేదికపైకి గ్రాడ్యుయేషన్‌ వాక్‌ చేశారు. పిల్లలు గ్రాడ్యుయేషన్‌ సంగీతాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ గ్రాడ్యుయేషన్‌ వాక్‌ చేయడం చూసి మొత్తం అతిథులు మైమరచిపోయారు. తెలుగు భాషా వికాస పోటీలు నిర్వహించి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. తారా కృష్ణన్‌ (శాంటా క్లారా బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌) ముఖ్య అతిథిగా హాజరై, తరువాతి తరం తెలుగు పిల్లలకు భాష నేర్పడంలో కృషి చేస్తున్న పాఠశాల బృందాన్ని అభినందించారు. 

కార్యక్రమంలో కొండల్‌ రావు (బాటా ప్రెసిడెంట్‌) సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పాఠశాల ఇనిషియేటివ్‌లో బాటా టీమ్‌ పూర్తిగా నిమగ్నమైందని మరియు వారు దీనిని విజయవంతం చేస్తారని అన్నారు. బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీని పరిచయం చేశారు: శివ కదా(వైస్‌ ప్రెసిడెంట్‌), వరుణ్‌ ముక్కా (సెక్రటరీ) హరి సన్నిధి (జాయింట్‌ సెక్రటరీ). 

‘‘స్టీరింగ్‌ కమిటీ’’లో రవి తిరువీదుల, కామేష్‌ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్‌ కుదరవళి, సుమంత్‌ పుసులూరి ఉన్నారు. 

కల్చరల్‌ డైరెక్టర్లు - శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి మరియు తారక దీప్తి. ‘‘నామినేటెడ్‌ కమిటీ’’ సురేష్‌ శివపురం, రవి పోచిరాజు, సందీప్‌ కేదారిశెట్టి.

యూత్‌ కమిటీ - సంకేత్‌, ఆదిత్య, గౌతమి, ఉదయ్‌.

బాటా అడ్వయిజరీ టీమ్‌ - జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ, కళ్యాణ్‌ కట్టమూరి, హరినాథ్‌ చీకోటి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా విజయవంతం చేసిన బాటా టీమ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమానికి తానా టీమ్‌ సభ్యుడు శ్రీనివాస్‌ వల్లూరిపల్లి కూడా హాజరయ్యారు.

బేఏరియా పాఠశాల సమన్వయకర్తలు: శ్రీదేవి యెర్నేని, సురేష్‌ శివపురం, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, సునీత రాయపనేని, రవి పోచిరాజు.

ఉపాధ్యాయులు: పద్మా సొంటి, విజయ గోపరాజు, శ్రీదివ్య యలమంచి, షీలా గోగినేని, శ్రీకాంత్‌ దాశరధి, పద్మా విశ్వనాథ్‌, ధనలక్ష్మి, శరత్‌ పోలవరపు, దీప్తి మండలి, దీపిక బీహెచ్‌ఎస్‌, రాగిణి అరసాడ, ధన కనగల, శ్యామ్‌ బాలే, శ్రీనివాస్‌ కొల్లి.

హాజరైన వారందరికీ విలాసవంతమైన విందు అందించారు. 

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :