ASBL NSL Infratech

అమెరికా కోర్టు న్యాయమూర్తిగా జయ బాడిగ  

అమెరికా కోర్టు న్యాయమూర్తిగా జయ బాడిగ  

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాడిగను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎపి నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా బాడిగ జయ గుర్తింపు పొందారు. కృష్ణాజిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె అయిన జయ ఉస్మానియా యూనివర్శిటీలో బిఏ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.  2022 నుంచి కోర్టు కమిషనర్గా పనిచేస్తున్న బాడిగ జయ కాలిఫోర్నియాలో ఫ్యామిలీ లా నిపుణురాలిగా గుర్తింపు పొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగానూ వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో పుట్టిన బాడిగ జయ హైదరాబాదులో చదువుకున్నారు. 1991-1994 నడుమ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, పొలిటికల్ సైన్సు సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. మూడు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్య అభ్యసించారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కేర్ సర్వీసెస్ అటార్నీగా, గవర్నర్ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలో కూడా జయ పనిచేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :