ASBL NSL Infratech

ఫియ‌ర్, పుష్ప‌, జ‌ర‌గండి.. విజేత ఎవ‌రు?

ఫియ‌ర్, పుష్ప‌, జ‌ర‌గండి.. విజేత ఎవ‌రు?

టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, ఎన్టీఆర్ న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమాలు ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్స్ ఇప్ప‌టికే రిలీజయ్యాయి. మొద‌టిగా రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ నుంచి జ‌ర‌గండి అనే సాంగ్ రిలీజైంది. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట ఆడియ‌న్స్ ను శాటిస్‌ఫై చేయ‌లేద‌నే కామెంట్స్ ముందు నుంచి వినిపిస్తున్నాయి. అందుకే ఎక్కువ వ్యూస్ కూడా తెచ్చుకోలేక‌పోయింది.

ఇక త‌ర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప‌2 నుంచి టైటిల్ సాంగ్ రిలీజైంది. ఈ ట్రాక్ ఆశించిన స్థాయిలో లేన‌ప్ప‌టికీ మెల్లిగా ఆడియ‌న్స్ లోకి వెళ్తుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన క్యాచీ ట్యూన్, బ‌న్నీ స్టైలిష్ స్టెప్పులు పాట‌కు హైప్ ను పెంచుతున్నాయి. మూవీ రిలీజ్ లోపు ఈ సాంగ్ కు మ‌రింత క్రేజ్ పెర‌గ‌డం ఖాయం. ఇక తాజాగా ఎన్టీఆర్ న‌టిస్తున్న దేవ‌ర నుంచి ఫియ‌ర్ సాంగ్ రిలీజైంది.

ఈ సాంగ్ ఫ్లాప్ సాంగా లేక ఛార్ట్‌బ‌స్ట‌రా అని వెంటనే చెప్ప‌లేని రీతిలో నెట్టింట డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. విజువల్స్ గురించి ప‌క్క‌న పెడితే మ్యూజిక్ వ‌ల్ల రామ జోగ‌య్య శాస్త్రి రాసిన మంచి సాహిత్యం స‌రిగా వినిపించ‌డం లేద‌నే కామెంట్స్ మాత్రం ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. మ్యూజిక్ ప‌రంగా మాత్రం పాట బాగుంది. కానీ నాగ‌వంశీ చెప్పిన‌ట్లు జైల‌ర్ లోని హుకూం సాంగ్ ని మించిపోవ‌డం మాత్రం జ‌ర‌గ‌ని ప‌ని. ఒక‌వేళ దేవ‌ర రిలీజ్ త‌ర్వాత సాంగ్ కు మ‌రింత ఇంపాక్ట్ పెరుగుతుందేమో చెప్ప‌లేం కానీ హుకూం సాంగ్ ని మ‌ర్చిపోయేలా చేయ‌డం మాత్రం క‌ష్ట‌మే. కానీ ఫియ‌ర్ సాంగ్ మాత్రం వినేకొద్దీ ఆడియ‌న్స్ కు బాగా ఎక్కడం ఖాయం. దేవ‌ర సాంగ్ రిలీజైంది మొన్నే కాబ‌ట్టి సాంగ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో తెలియ‌డానికి ఇంకొన్ని రోజులు ప‌ట్ట‌నుంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :