ASBL NSL Infratech

ఘనంగా "మల్లె మొగ్గ" సినిమా సక్సెస్ మీట్, "తథాస్తు" మూవీ పోస్టర్ లాంఛ్

ఘనంగా "మల్లె మొగ్గ" సినిమా సక్సెస్ మీట్, "తథాస్తు" మూవీ పోస్టర్ లాంఛ్

కన్నా నాగరాజు సమర్పణలో హెచ్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ తేజ్, వర్షిని, మౌనిక హీరో హీరోయిన్లుగా తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మల్లె మొగ్గ’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించడంతో పాటు రామ్ తేజ్ హీరోగా ఈ సంస్థ నిర్మిస్తున్న కొత్త సినిమా "తథాస్తు" పోస్టర్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ చంద్రమహేశ్ మాట్లాడుతూ - ‘మల్లె మొగ్గ’ విజయంవంతం కావడం సంతోషంగా ఉంది. దర్శకుడు తోట వెంకట నాగు తన జీవితంలో చూసిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. హీరో రామ్ తేజ్ ఎనర్జిటిక్ గా నటించాడు. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు తప్పకుండా ఆదరణ పొందుతాయి. ‘మల్లె మొగ్గ’ సినిమా ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా టీమ్ కు నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - ‘మల్లె మొగ్గ’ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కుతోందని మూవీ టీమ్ చెబుతుండటం హ్యాపీగా ఉంది. ఏటా విడుదలయ్యే సినిమాల్లో 5 శాతం సక్సెస్ అవుతున్నాయి. ఈ సంవత్సరం 230కి పైగా సినిమాలు రిలీజైతే ఆదరణ పొందినవి కేవలం 10 మాత్రమే. చిన్న సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. కంటెంట్ ఉండటం వల్లే ‘మల్లె మొగ్గ’ సినిమా సక్సెస్ అందుకుంది. భానుచందర్ తో నాకు పాతికేళ్ల పరిచయం ఉంది. హీరో రామ్ తేజ్ బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఈ సంస్థ మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత బాలాజీ నాగలింగం మాట్లాడుతూ - దామోదర ప్రసాద్ తండ్రి గారు సినిమాలు చేసేప్పుడు వారి సంస్థలో పనిచేశాను. సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలోనే ఉన్నాం. నిర్మాతగా ఇకపైనా చిత్ర పరిశ్రమలో కొనసాగాలని ఆశిస్తున్నాను. అన్నారు. 

సహ నిర్మాత కన్నా నాగరాజు మాట్లాడుతూ - తోట వెంకట నాగేశ్వరరావు చెప్పిన కథ నాకు బాగా నచ్చి ఈ ప్రాజెక్ట్ లోకి సహ నిర్మాతగా జాయిన్ అయ్యాను. బీ, సీ సెంటర్స్ లో మా ‘మల్లె మొగ్గ’  సినిమా మంచి ఆదరణ పొందుతోంది. మా దగ్గరలోని థియేటర్స్ లో మహిళా ప్రేక్షకులకు చీరలు పంచిపెట్టాం. ప్రతి మహిళ చూడాల్సిన సినిమా ఇది. ‘మల్లె మొగ్గ’ సినిమా మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు కోట శంకర్రావు మాట్లాడుతూ - మల్లె మొగ్గ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. చిన్న సినిమా బాగుండాలి. అప్పుడే మాలాంటి ఆర్టిస్టులకు అవకాశాలు వస్తాయి. పెద్ద సినిమా రెండేళ్ల టైమ్ పడుతుంది. కానీ చిన్న సినిమా కొన్ని నెలల్లోనే రిలీజ్ కు వస్తుంది. అలాంటప్పుడు అందరికీ పని దొరుకుతుంది. ఇలాంటి చిన్న చిత్రాలు ప్రేక్షకాదరణ పొందితే ఇండస్ట్రీ బాగుంటుంది. అన్నారు.

నటుడు భానుచందర్ మాట్లాడుతూ - ‘మల్లె మొగ్గ’ సినిమాలో మంచి క్యారెక్టర్ లో కనిపిస్తాను. మంచి స్టోరీతో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కడం సంతోషంగా ఉంది. ఈ కథలో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఉన్నాయి. మా డైరెక్టర్ నాగేశ్వరరావుకు నాగు అని పేరు పెట్టుకోమని నేనే చెప్పాను. సకుటుంబంగా ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమిది. ఈ సినిమాతో పాటు రామ్ తేజ్ చేస్తున్న తథాస్తు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. అన్నారు.

హీరో రామ్ తేజ్ మాట్లాడుతూ - నన్ను హీరోగా చేసిన మా మామయ్య, మా డైరెక్టర్ తోట వెంకట నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు. మా మామయ్యకు నేను ఇలా వేదిక మీద చెప్పడం తొలిసారి. కానీ ఆయన నా మనసులో ఉంటారు. ఆయన పేరు, మా తాతయ్య పేరు నిలబెడతా. మల్లె మొగ్గ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ. మేము ఇకపై సిటీ నేపథ్యమున్న చిత్రాలు కూడా తీయాలనుకుంటున్నాం. అన్ని జానర్స్ మూవీస్ తో మీ ముందుకు వస్తాం. మల్లె మొగ్గ సినిమాలాగే మా నెక్ట్ మూవీస్ కు కూడా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శక నిర్మాత తోట వెంకట నాగేశ్వరారవు మాట్లాడుతూ - ‘మల్లె మొగ్గ’ సినిమాకు బీ, సీ సెంటర్స్ ఆదరణ బాగుంది. సిటీలో థియేటర్స్ తక్కువగా దొరికాయి. రిలీజైన ప్రతి చోటా మూవీ బాగుందనే రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తోంది. ఇది ఎమోషన్, సెంటిమెంట్, లవ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మేము ఇప్పుడు చేయబోయే తథాస్తు మూవీ కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :