ASBL NSL Infratech

కాకాణి vs సోమిరెడ్డి.. వేదికగా మారిన బెంగళూర్ రేవ్ పార్టీ..

కాకాణి vs సోమిరెడ్డి.. వేదికగా మారిన బెంగళూర్ రేవ్ పార్టీ..

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ విషయంలో ఇప్పటికే పలువురు సెలబ్రెటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీ కారణంగా మరొకసారి కాకాణి వర్సెస్ సోమిరెడ్డి మాటల యుద్ధం మొదలైంది. ఏపీలో అధికార వైసీపీ- విపక్ష టీడీపీ మధ్య ఈ రేవ్ పార్టీ తీవ్ర వాగ్వివాదానికి దారి తీస్తోంది. మరి ముఖ్యంగా ఈ వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ విషయం మరింత వేడెక్కుతుంది. 

బెంగళూరులో ఆదివారం నాటి రాత్రి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో వ్యాపారవేత్త తన బర్త్డే సందర్భంగా చిన్న రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ చిన్న పార్టీలో చాలా పెద్ద మనుషులు పోలీసుల చేతికి చిక్కారు.  ఇదే పార్టీ లో ఎమ్మెల్యే కాకాణి పేరిట కారు మీద స్టిక్కర్, పాస్‌పోర్టు లభించాయి. ఇక ఈ పార్టీలో ఎందరో సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. 25 మంది యువతి యువకులతో పాటు 15 విలువైన కార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారు అక్కడ లభ్యమవ్వడం పై సోమిరెడ్డి సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఎలాగైనా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో సోమిరెడ్డి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు మధ్యాహ్నం నెల్లూరులో విలేకరులతో సమావేశమైన సోమిరెడ్డి..రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని చెబుతున్న కాకాణి.. అక్కడ అతని పాస్‌పోర్టు, స్టిక్కర్లు ఎందుకు దొరికాయో కూడా చెప్పాలి అని డిమాండ్ చేశారు.

అంతేకాదు నకిలీ మద్యం, నకిలీ పత్రాల తయారీలో కాకాణికి సంబంధం ఉందని సోమిరెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు జైలుకు వెళ్లారని.. నకిలీ మద్యం కేసులో మరో 15 మంది జైలులో ఉన్నారని సోమిరెడ్డి గుర్తు చేశారు. అంతర్రాష్ట్ర ముఠాలతో కాకాణి కి సంబంధం ఉందని సోమిరెడ్డి అన్నారు. అతను చేసే ఇటువంటి వ్యవహారాలపై ఓ పెద్ద పుస్తకమే రాయచ్చని సోమిరెడ్డి పేర్కొన్నారు. కర్ణాటకలో 224 మంది, ఏపీలో 175, తెలంగాణలో 119 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు.. కానీ ఇందరి మధ్యలో ఒక్క కాకాణి స్టిక్కర్ పేరున్న కారు మాత్రమే పోలీసులకు ఎందుకు దొరికిందో అర్థం కావడం లేదని సోమిరెడ్డి అన్నారు. మొత్తానికి ఈ ఒక్క పార్టీతో కాకాణి.. సోమిరెడ్డి సాలిడ్ గా బుక్ అయ్యారు.త్వరలో ఈ విషయానికి సంబంధించి మరిన్ని పేర్లు బయటపడే అవకాశం ఉందని టాక్.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :