ASBL NSL Infratech

616 వ అన్నమయ్య జయంతి సందర్భంగా "మహానగర సంకీర్తన"

616 వ అన్నమయ్య జయంతి సందర్భంగా "మహానగర సంకీర్తన"

పద్మశ్రీ డా. శోభారాజు గారిచే స్థాపించబడిన అన్నమాచార్య భావనా వాహిని సంస్థ 41 సంవత్సరాలుగా అన్నమాచార్య సంకీర్తనల ప్రచారానికి కృషి చేస్తూనే వుంది. ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 616 వ అన్నమయ్య జయంతిని పురస్కరించుకొని మే 23 వ తేదీ ఉదయం 7 గంటలకు రామకృష్ణ మఠం నుండి టాంక్ బండ్ మీద ఉన్న అన్నమాార్యుల వారి విగ్రహం వరకు "మహానగర సంకీర్తన" నిర్వహిస్తారు.

శ్రీ సాందిప్ శ్రీ వేంకటేశ్వర స్వామి వేషధారణలో, చిరంజీవి మానస పటేల్ అన్నమయ్య వేషధారణలో విద్యార్థులు, భక్తులందరితో అన్నమయ్య విగ్రహం వద్దకు చేరుకొని అక్కడ "అన్నమయ్య గోష్ఠిగానం" నిర్వహిస్తారు. ప్రముఖ కళాకారులు శ్రీమతి గాయత్రి నారాయణ, శ్రీమతి మానస ఆచార్య , శ్రీవాణి శైలజ అచంట, మరియు అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ముఖ్య అతిథులుగా పూజ్యశ్రీ రంగరాజన్ స్వామి వారు, చిలుకూరు, ఆత్మీయ అతిథులుగా డా.అనంతలక్ష్మి గారు, తిరునగరి జ్యోత్స్న గారు, శ్రీ బ్నిం గారు విచ్చేయుచున్నారు. ఇటీవల అన్నమాచార్య భావనా వాహిని నిర్వహించిన "ఆవకాయ- మాగాయ పోటీ" విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కార్యక్రమం అనంతరం అందరికీ ఉదయం 8:30 గా.లకు హారతి, ప్రసాదం అల్పాహార వితరణ ఉంటుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :