ASBL NSL Infratech

హృతిక్, తార‌క్ కోసం నేష‌న‌ల్ అవార్డ్ కొరియోగ్ర‌ఫ‌ర్

హృతిక్, తార‌క్ కోసం నేష‌న‌ల్ అవార్డ్ కొరియోగ్ర‌ఫ‌ర్

కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో దేవ‌ర కు సంబంధించిన కీలక భాగం పూర్తి చేసిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వార్ 2 సినిమా కోసం హృతిక్ రోష‌న్ తో కలిసి న‌టిస్తున్నాడు. దీని కోసం ఎన్టీఆర్ ముంబైలోనే ఉంటూ షూటింగ్ లేని టైమ్ లో బాలీవుడ్ పార్టీల్లో క‌నిపిస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం వార్2 యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో పాటూ ఈ ఇద్ద‌రి కాంబోలో ఓ సాంగ్ ను కూడా షూట్ చేయ‌బోత‌న్నార‌ట‌. ఆ సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ చేయ‌డానికి వైభ‌వి మ‌ర్చంట్ ను తీసుకున్న‌ట్లు ముంబై మీడియా వ‌ర్గాలు చెప్తున్నాయి.  ఈమె గురించి టాలీవుడ్ ఆడియ‌న్స్ కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోయినా వైభ‌వి ఫిల్మోగ్ర‌ఫీ మామూలుది కాదు.

హం దిల్ దే చుకే స‌నమ్ లో డోలారే డోలాతో ప‌రిచ‌య‌మైన వైభ‌వి ఫ‌స్ట్ సాంగ్ కే నేష‌నల్ అవార్డ్ సాధించి అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. మ‌హేష్ బాబు అత‌డు సినిమాకు కూడా వైభ‌వి వ‌ర్క్ చేసింది. వైభవి అయితేనే తార‌క్, హృతిక్‌తో పోటీప‌డే స్టెప్పులేయించ‌గ‌ల‌ద‌ని ఇరు హీరోల ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే వార్2 కోసం ప్రీత‌మ్ నెక్ట్స్ లెవ‌ల్ ఆల్బ‌మ్ ను కంపోజ్ చేశాడ‌ని టాక్.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :