ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న సంయుక్త‌?

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్న సంయుక్త‌?

నార్త్ హీరోయిన్లు సౌత్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి సెటిల‌వ‌డం చాలా కామ‌న్. ఇక్క‌డ న‌టించే స‌గానికి పైగా హీరోయిన్లు నార్త్ నుంచి దిగుమ‌తి అయిన వాళ్లే. కానీ ఇక్క‌డి నుంచి నార్త్ కు వెళ్లి అక్క‌డ క్రేజ్ సంపాదించి, అక్క‌డే హీరోయిన్లుగా సెటిలైన వారు చాలా త‌క్కువ‌. త్రిష లాంటి ఎంతో మంది హీరోయిన్లు బాలీవుడ్ లో త‌మ ల‌క్ ను టెస్ట్ చేసుకుని వెనుదిరిగి వ‌చ్చేశారు.

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార సైతం జ‌వాన్ సినిమా వ‌ర‌కు బాలీవుడ్ కు అడుగుపెట్ట‌లేదు. ఆ సినిమా హిట్ట‌యినా స‌రే న‌య‌న్ కు అక్క‌డి నుంచి కొత్త ఛాన్సులేమీ రాలేదు. దీంతో అస‌లు సౌత్ హీరోయిన్ల‌కు బాలీవుడ్ సెట్ కాద‌ని అంద‌రూ ఓ అభిప్రాయానికి వ‌చ్చేశారు. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు సౌత్ నుంచి మ‌రో హీరోయిన్ బాలీవుడ్ దారి పడుతుంది.

భీమ్లా నాయ‌క్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆ త‌ర్వాత బింబిసార‌, సార్, విరూపాక్ష సినిమాలతో వ‌రుస విజ‌యాలు అందుకున్న మ‌ల‌యాళ బ్యూటీ సంయుక్తా మీన‌న్ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతున్న‌ట్లు స‌మాచారం. తాజాగా ఓ భారీ బాలీవుడ్ సినిమా టెస్ట్ లుక్ లో పాల్గొన‌డానికి సంయుక్త ముంబైలో అడుగుపెట్టింద‌ట‌. ఆమె వెంట ఓ ఫేమ‌స్ క్యాస్టింగ్ డైరెక్ట‌ర్ కూడా క‌నిపించాడ‌ని ముంబై మీడియాలో వార్త‌లొస్తున్నాయి. త్వ‌ర‌లోనే సంయుక్త బాలీవుడ్ ఎంట్రీ గురించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే ఛాన్సుంది. మ‌రి ఈ బాలీవుడ్ ఆఫ‌ర్ సంయుక్త‌కు ఏ మేర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :