ASBL NSL Infratech

కీవ్ పై రష్యా డ్రోన్ల దాడి

కీవ్ పై రష్యా డ్రోన్ల దాడి

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ పై రష్యా పెద్దఎత్తున డ్రోన్‌ దాడులకు పాల్పడింది. వీటిలో కొన్ని ఈ నగరంలోని ఐదు భవంతులకు పాక్షికంగా నష్టం కలిగించగా, మిగిలినవాటిని ఉక్రెయిన్‌ సైన్యం అడ్డుకోగలిగింది. ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. ఇతర దాడులకంటే వీటి తీవ్రత తక్కువ. ఇరాన్‌లో తయారైన 13 డ్రోన్లను తమ బలగాలు చేదించి, నిర్వీర్యం చేయగలిగాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడిరచారు.  వీటిలో పేలుడు పదార్థాలు నింపి ఉన్నాయని తెలిపారు. డ్రోన్ల శకలాలు కొన్ని భవనాలపై పడి నష్టం కలిగించాయని వివరించారు. వీటిని ప్రయోగించన వారిని ఉగ్రవాదులుగా అభివర్ణించారు.  మరోవైపు యుద్ధం  మొదలయ్యాక శరణార్థులుగా దేశ, విదేశాలకు వెళ్లినవారిలో 50 లక్షల మంది తిరిగి తమతమ ఇళ్లకు చేరుకుంటున్నారని ఐరాస తెలిపింది.  యుద్ద ఖైదీల అప్పగింతలో భాగంగా 64 మంది ఉక్రెయిన్‌ సైనికుల్ని తాజాగా విడుదల చేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :