మ్యాన్లీ లుక్‌తో అద‌ర‌గొడుతున్న రామ్

మ్యాన్లీ లుక్‌తో అద‌ర‌గొడుతున్న రామ్

ఉస్తాద్ హీరో రామ్ కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నాడు. ఈ ఏడాది ది వారియ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రామ్ త‌న నెక్ట్స్ సినిమా బోయ‌పాటి శ్రీను డైరెక్ష‌న్‌లో చేస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చేయ‌నున్నారు. 

మామూలుగానే బోయ‌పాటి సినిమాలు ఊర మాస్ రేంజ్‌లో ఉంటాయి. ప్ర‌స్తుతం ఆ సినిమాకు త‌గ్గ‌ట్లు త‌న లుక్స్‌ని రెడీ చేసుకుంటున్నాడు రామ్. లేటెస్ట్‌గా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి విజ‌య‌వాడ వెళ్లిన రామ్ ర‌గ్డ్ లుక్ తో వావ్ అనిపించేలా ఉన్నాడు. చూస్తుంటే బోయ‌పాటి సినిమాకు కావాల్సిన క‌టౌట్‌ని రామ్ రెడీ చేసే ప‌నిలో ఉన్న‌ట్టున్నాడు. 

ది వారియ‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డంతో ఈ సారి ఎలాగైనా బోయ‌పాటి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని మంచి క‌సి మీదున్నాడు రామ్. బోయ‌పాటి కూడా ఫ‌స్ట్ టైమ్ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. రామ్ తో నేష‌న‌ల్ లెవ‌ల్ లో ప్రేక్ష‌కుల్ని మెప్పించే క‌థ‌తో బోయ‌పాటి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

మంచి మ్యాన్లీ లుక్ తో క‌నిపిస్తున్న రామ్ సినిమా మొత్తం ఇదే లుక్ మెయిన్‌టెయిన్ చేస్తే మాత్రం ఓ రేంజ్ లో ఉండ‌బోతోంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. రామ్ ఎన‌ర్జీకి బోయ‌పాటి లాంటి మాస్ డైరెక్ట‌ర్ తోడై, దానికి స‌రైన స్టోరీ ప‌డితే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసే ఛాన్సుంద‌ని సినీ విశ్లేష‌కులు చెప్తున్నారు. అఖండ‌తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న బోయ‌పాటి, ఈ సినిమాతో రామ్ కు అంత‌కంటే పెద్ద హిట్ ఇవ్వాల‌ని ట్రై చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

ఇటీవ‌లే సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ సినిమా స్టోరీ ఏంటి అన్న‌ది ఇప్ప‌టికైతే ఎవ‌రికీ తెలీదు. సినిమా నుంచి త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌తో ఫ్యాన్స్ ను ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ సినిమా రామ్ కు ఎలాంటి  ఫ‌లితాన్ని మిగులుస్తుందో చూడాలి.

 

Tags :