ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

స్లిమ్ అయిన 'బుట్టబొమ్మ' ...

స్లిమ్ అయిన 'బుట్టబొమ్మ' ...

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మధ్య మరీ సన్నబడింది అనే టాక్ వస్తుంది. ఈ ఫొటోలు చూస్తుంటే నిజంగానే పూజా హెగ్డే సన్నగా అయ్యింది అనిపిస్తుంది. అంత స్లిమ్  అయినా ఈ బ్యూటీ అందం ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్ గా జరిగిన ఫోటోషూట్ లో ఈ అమ్మడి స్టిల్స్ మతిపోగోతుంది. సాధారణంగా కొందరు లావుగా ఉంటే అందంగా ఉంటారు.. కొందరు మాత్రం ఇలా సన్నగా ఉంటేనే అందంగా ఉంటారు అంటూ పూజా హెగ్డే అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో అలరిస్తూ ఉంటుంది పూజ హెగ్డే. తాజాగా వేసిన పాయింట్ టాప్, జాకెట్ పూజకి  భలే సెట్టయ్యాయని చాలా మంది మాట్లాడుకుంటున్నారు.హాట్ హాట్ స్టిల్స్ తో ఈ ముద్దుగుమ్మ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక పూజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు బాలీవుడ్ లో సైతం తగ్గేదేలే అంటూ వరుసగా సినిమాలకు సైన్ చేసింది హేగ్డా. ఈ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి వెనువెంటనే రిలీజ్ అవుతుండడం విశేషం.

ఇటు సినిమాలు, అటు షూట్స్ తో బిజీగా ఉన్న సమయంలోనే పూజా హెగ్డే పై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు హిందీ సినిమాలపై మోజు పెంచుకోవడంతో తెలుగు లో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం పై నెగిటిన్లు మండిపడుతున్నారట.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :